అధ్యక్షులుగా అనంతగిరి వెంకన్న.
డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 02(నమస్తే న్యూస్).
మరిపెడ మున్సిపాలిటీలోని సీతారాముల వారి దేవస్థానంలో మంగళవారం మరిపెడ మండల రేషన్ డీలర్ల సంఘం నూతన కమిటీ ఎన్నికను నిర్వహించారు.ఈ ఎన్నికలో అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన అనంతగిరి వెంకన్న అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గ సభ్యులు:ఉపాధ్యక్షులు:బానోతు బాలు,బుర్ర యాదగిరి,ప్రధాన కార్యదర్శి:తప్పెట్ల ఉపేందర్,కార్యదర్శి:గుగులోతు రాము,కోశాధికారి:గంధం భద్రయ్య,గౌరవ అధ్యక్షులు:భూక్యా కిషన్,బోర మల్లయ్య,గౌరవ సలహాదారులు:ఎస్.కె.హబీబ్ ఉద్దీన్,సింగబోయిన నరసింహ లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు అనంతగిరి వెంకన్న మాట్లాడుతూ,తనపై నమ్మకంతో నన్ను ఎన్నుకున్న డీలర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని,అవసరమైతే పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

