రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
గార్ల, సెప్టెంబర్ 2 (నమస్తే న్యూస్): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో మెగా, జనసేన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. నెహ్రూ సెంటర్లో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గార్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారి త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాయకుడు బాదావత్ యుగంధర్ నాయక్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2 వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు, జనసైనికులకు పండుగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని పవన్ కళ్యాణ్ అభిమానులు, సీనియర్ల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పిఠాపురంలో జనసేన యువజన విభాగం లోగో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

