గుండమరాజుపల్లిలో ఓటర్లకు నోటీసులు.. వివరాల పరిశీలన
చిన్నగూడూరు, సెప్టెంబర్ 02 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండమరాజుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు SIR కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్లకు నోటీసులు అందజేస్తూ, ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సవరణకు చర్యలు చేపడుతున్నారు.
మండల తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది గ్రామంలో పర్యటించి ఓటర్ల నుంచి అవసరమైన వివరాలను సేకరించారు. ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లో ఉన్న తప్పులను పరిశీలించి, వాటిని సరిచేసేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు SIR కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

