మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగులోత్ రవి నాయక్.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 01 (నమస్తే న్యూస్):
మరిపెడ మండలం వాంకుడోతు తండాకు చెందిన వాంకుడోతు సరస్వతి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి(సి ఎమ్ ఆర్ ఎఫ్)ద్వారా మంజూరైన రూ.1,50,000 విలువైన ఎల్ఓసీని మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగులోతు రవి నాయక్ అందజేశారు.ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సరస్వతి కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని అందజేశారు.అనారోగ్యంతో బాధపడుతున్న సరస్వతి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఎమ్మెల్యేను సంప్రదించగా,వెంటనే స్పందించి సీఎం సహాయనిధికి సిఫారసు చేశారు.ఈ సందర్భంగా గుగులోతు రవి నాయక్ మాట్లాడుతూ,పేద,మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా అండగా నిలుస్తోందని అన్నారు.ప్రజలకు వైద్య ఖర్చుల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయనిధి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.సకాలంలో ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ కు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు గుగులోతు రవి నాయక్ కు సరస్వతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు…


