రాహుల్ గాంధీ గారిపై పెట్టిన FIRను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవం గురించి ప్రశ్నిస్తే కేసులా? ఇదేనా బీజేపీ చెప్పే ప్రజాస్వామ్యం?హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభ అనంతరం జరిగిన ‘శుద్ధీకరణ’ ఘటనపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై FIR నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న అన్నారు.ప్రశ్నించిన గొంతుపై కేసు.. అన్యాయాన్ని ప్రశ్నించిన నాయకుడిపై కేసు..
రాజ్యాంగం గురించి మాట్లాడితే కేసు..ఇదేనా బీజేపీ మార్కు ప్రజాస్వామ్యం?బీజేపీ ప్రభుత్వానికి నిజంగా దళితుల ఆత్మగౌరవంపై చిత్తశుద్ధి ఉంటే, ఈ వివాదానికి సంబంధించిన అన్ని అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. ప్రశ్నించిన రాహుల్ గాంధీ పై మాత్రమే కేసులు పెట్టి రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం సిగ్గుచేటు.రాహుల్ గాంధీని కేసులతో భయపెట్టాలని బీజేపీ చూస్తే అది వారి భ్రమ మాత్రమే.ప్రజల తరఫున ప్రశ్నించే రాహుల్ గాంధీ గారి గొంతును అణచివేయడం బీజేపీ తరం కాదు. FIRలు పెట్టండి.. కేసులు పెట్టండి.. కానీ రాజ్యాంగం కోసం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ చేసే పోరాటాన్ని మాత్రం ఆపలేరు.బీజేపీకి చేతనైతే కేసులతో రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కాదు.. ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అసమానతలు, దళితులపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలి.కేసులు పెట్టడం బీజేపీ బలం కాదు..ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బలహీనతకు నిదర్శనం, రాహుల్ గాంధీ ఒక్కరిపై కేసు కాదు..ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించిన ప్రతి గొంతుపై దాడి ఇది!బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు కాంగ్రెస్ భయపడదు — బెదరదు — వెనక్కి తగ్గదు అన్నాడు.

