రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డిసిసి అధ్యక్షురాలు డా. భూక్య ఉమా మురళి నాయక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమంలో అన్ని మండలలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.ఈధర్నాలో M.P పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తో పాటు బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జూలకంటి సీతారాం రెడ్డి ధర్నాలో పాల్గొని ,ఈ సందర్భంగా సీతారాం రెడ్డి మాట్లాడుతూ…బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ పై ఎస్సీ, ఎస్టీ లు కేసులు నమోదు చేయడం బిజెపి ప్రభుత్వానికి సబబు కాదు అని ఖండించారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని భారతదేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని బిజెపి ప్రభుత్వం ఇలా దుర్జేశ పూర్వకంగానే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం సబబు కాదని అన్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హల్ద్వానీ ర్యాలీ వేదిక వద్ద బీజేపీ-ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జరిపిన అత్యంత హేయమైన , కులతత్వ “శుద్ధీకరణ ఆచారం”కు ప్రత్యక్ష కొనసాగింపుగా, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక పత్రికా సమావేశంలో, ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త వినయ్ బాబు, వర్షిక రాజు, షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

