రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్ | సెంటర్: బయ్యారం
బయ్యారం, ఆగస్టు 31 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగులోత్ శాంతి, కిషన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో గ్రామంలోని పలు అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ పాల్గొని వీబీజీ రాంజీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం NREGS పేరును వీబీజీ రాంజీగా మార్చినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు, కూలీలు, గ్రామీణ ప్రజలకు అందే ప్రయోజనాలు, చేపట్టే పనులు, ఉపాధి అవకాశాలపై గ్రామసభలో వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను గుర్తించి అమలు చేయడంలో గ్రామసభల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, అవసరాలను గ్రామసభ దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బావ్సింగ్, గ్రామపంచాయతీ సెక్రటరీ రాంబాబు, ఉపసర్పంచ్ ఏనుగుల ఉమా రంజిత్, వార్డు సభ్యులు బానోత్ సునీత, ఎట్టి సరిత, బందెల కళింగరెడ్డి, ఎస్కే జానీ, బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి, తాటి జనార్దన్, ఆకునూరి సూర్యనారాయణ, ఎస్కే మధార్, బిళ్లకంటి వెంకన్నతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

