చెరువులో చేప పిల్లల విడుదల
డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 31 (నమస్తే న్యూస్): మరిపెడ మండలంలోని బోట్య తండా గ్రామ పంచాయతీలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.గ్రామ సర్పంచ్ బానోత్ విజయ్ కౌర్, బానోత్ కిషన్ సింగ్ సహకారంతో సేవాలాల్ సేవా సమితి ఉపాధ్యక్షుడు, యువ నాయకుడు ధారావత్ వెంకటేష్, భోజ్య, సాగర్, ప్రవీణ్, సురేష్, డీలర్ శ్రీను, వెంకన్న, సతీష్ తదితర తండావాసులు, యువకుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను అందజేశారు.చెరువులో చేప పిల్లల విడుదలఅనంతరం గ్రామ చెరువులో సర్పంచ్ బానోత్ విజయ్ కౌర్ చేతుల మీదుగా చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చే లక్ష్యంతో చెరువులో చేప పిల్లలను విడుదల చేసినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ.. సర్పంచ్ సహకారంతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న యువ నాయకులు వెంకటేష్, భోజ్య, సాగర్లను అభినందించారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తండా నాయకులు, యువకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



