వాల్యతండా గ్రామ పంచాయితీలో సంక్షేమ కార్యక్రమాలు.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 30(నమస్తే న్యూస్).
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వాల్యతండా గ్రామ సర్పంచ్ నాగ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని మండలంలోని వాల్యతండా గ్రామపంచాయతీలో ఆదివారం సర్పంచ్ నాగ నాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ నాగ నాయక్ మాట్లాడుతూ..గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని,దీంతో ఎంతో మంది పేద,మధ్యతరగతి కుటుంబాలు రేషన్ కు నోచుకోలేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా మార్చారని,అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.కొత్తగా అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా పేద,మధ్యతరగతి కుటుంబాలకు మరింత పారదర్శకంగా,సౌకర్యవంతంగా రేషన్ బియ్యం అందుతుందని,అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు ఈ కార్డు ఆధారంగా ఉంటుందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పాలిటీ ప్రభుత్వమని,సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి (జిపిఒ),గ్రామ పెద్దలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

