డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 30(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో అభివృద్ధి పనులకు మున్సిపాలిటీ వేగం పెంచింది.పట్టణంలోని 9వ వార్డు పరిధిలో ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..9వ వార్డు ప్రజలు చాలా కాలంగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని,వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.స్థానిక కౌన్సిలర్ విజ్ఞప్తి మేరకు తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని,నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.మరిపెడ పట్టణాన్ని అన్ని వార్డుల్లో సమగ్ర అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుగులోత్ నీలా లచ్చిరాం,కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్,9వ వార్డు అధ్యక్షుడు గంధసిరి సోమన్న,నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి,షేక్ ఆఫ్జల్,కారంపుడి ఉపేంధర్, గంధసిరి భిక్షపతి, చెన్నూరు మహేష్,యాకుబ్ జానీ, దూగుంట్ల వెంకన్న,కుమార్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు…



