ఆగస్టు 31న కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 30 (నమస్తే న్యూస్ )
విద్య వైద్యం పేదలకు ఉచితంగా అందించాలని వాటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను పిలుపునిచ్చారు తిరుమలాయపాలెం మండలం లో ప్రభుత్వ స్కూల్స్ హాస్పిటల్స్ పై సిపిఎం ఆధ్వర్యంలో గత 15 రోజులుగా సర్వే నిర్వహించడం జరిగింది . ఈ సర్వే లో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 31వ తేదీన జరిగే కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను పిలుపునిచ్చారు ప్రధానంగా ఆజ్మీర తండా జోగులపాడు మంగలి బండ లో మూసివేసిన స్కూల్ లను వెంటనే తెరిపించాలని బీరోలు హైస్కూల్లో పనికిరాకుండా ఉన్న ఓల్డ్ భవనాలను వెంటనే కూల్చివేయాలని హై స్కూల్ ప్రైమరీ స్కూల్స్‌కు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని స్కూల్స్ లో ఇంతవరకు యూనిఫామ్స్ ఇవ్వలేదని వాటిని ఇవ్వాలని స్కూల్స్ అన్నింటిలో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అలాగే హాస్పిటల్స్ లో పాతర్లపాడు పిహెచ్‌పి సొంత బిల్డింగ్ ఏర్పాటు చేయాలని సుబ్లేడ్ హాస్పిటల్ లో సెకండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని మండల కేంద్రంలో హాస్పటల్ పనులు త్వరగా పూర్తి చేయాలని బచ్చోడు సబ్ సెంటర్ బిల్డింగ్ నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు యొక్క సమస్యలన్నింటిని రేపు కలెక్టరేట్ ముందు పరిష్కరించాలని ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో తుళ్లూరి నాగేశ్వరరావు అంగిరేకుల నరసయ్య కోడి లింగయ్య కొత్తపల్లి దామోదర్ రెడ్డి చిగురుపాటి ఉపేందర్ మెరుసుల వెంకటేష్ దొడ్డ లింగస్వామి పద్మనాభల సుధాకర్ పుట్టల గురవయ్య గంటల రాము నవీన్ తదితరులు పాల్గొన్నారు.

