రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 30 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని బచ్చోడు గ్రామానికి చెందిన యువ నాయకుడు అంగిరేకుల కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఆదివారం పాలేరు నియోజకవర్గం లోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో బచ్చోడు గ్రామ అధ్యక్షులు జక్కుల యాదగిరి, 7వ వార్డు సభ్యులు రామకృష్ణ, 9వ వార్డు సభ్యులు రాజు, యువజన నాయకులు లింగరాజు ఆధ్వర్యంలో కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అంగిరేకుల కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో బానిసత్వంగా ఉందని, అందుకే ఆ పార్టీని వీడి స్వేచ్ఛ కోసం బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నానని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

