ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, ఆగస్టు 30 (నమస్తే న్యూస్): నర్సంపేట నియోజకవర్గంలోని మర్రిపల్లి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నూతన వాటర్ ప్లాంట్ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ప్లాంట్ పనితీరును ఎమ్మెల్యే పరిశీలించారు.గ్రామ ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. తాగునీటి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్లాంట్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



