
రామన్నపేట ఆగస్టు 29( నమస్తే న్యూస్)
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యం తో చికిత్స పొందుతున్న బోగారం గ్రామానికి చెందిన రాపోలు దేవి, గండూరి వెంకటేశ్వర్లు, గండూరి యాదగిరి లను బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వారికి మనోధైర్యం కల్పిస్తూ “నేనున్నాను… ధైర్యంగా ఉండండి” అంటూ భరోసా ఇచ్చారు. భగవంతుని ఆశీస్సులతో వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంతటి మల్లేష్, కూనూరు రాజు, గోగు సత్యనారాయణ యాదవ్, బద్దుల మహేష్ యాదవ్, కూనూరు మహేష్ గౌడ్, రాపోలు లక్ష్మీనారాయణ, కొక్కుల శంకర్, మేడి కృష్ణ, మేడి శ్రీరాములు, మేడి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
