రామన్నపేట ఆగస్టు 29( నమస్తే న్యూస్)
స్థానిక మండల కేంద్రంలోని వివేకానందాస్ డివైన్ మోడల్ స్కూల్ లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అలంకరించి, బోనాలను నెత్తిన ఎత్తుకొని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాల నడుమ శోభా యాత్ర నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు తిరుగుడు మల్లికార్జున్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ — “మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమైనది. విద్యార్థులకు చదువుతో పాటు మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేయడానికే ఈ వేడుకలను నిర్వహించాం. అమ్మవారి దయాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం” అని తెలిపారు.అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెలిమినేటి మల్లేష్ , ఉప ప్రధానోపాధ్యాయురాలు అస్మ, ఉపాధ్యాయులు నాగరాజు, ముత్యాలు, స్వామి, విద్యాసాగర్, సాయి, అనిత,సునీత,శాంతి, రాజేశ్వరి సరిత తదితర ఉపాధ్యాయులు మరియు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

