
రామన్నపేట ఆగస్ట్ 29( నమస్తే న్యూస్)
రామన్నపేట మండల కేంద్రంలోని ఆర్&బీ, విశ్రాంత భవనంలో రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో, నకిరేకల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి, హాజరయ్యారు, ఈ సందర్భంగా రామన్నపేట యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ,మాట్లాడుతూ రామన్నపేట మండలంలో నూతనంగా నియమించబడ్డ గ్రామ శాఖ అధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను అభినందించారు, నూతనంగా నియమింపబడ్డ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుగుడు రవి యాదవ్, నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పున్న అమరేందర్, నార్కెట్ పల్లి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జిల్లా పృధ్వీ, రామన్నపేట మండల ఉపాధ్యక్షులు కందగట్ల రాహుల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు మేకల జలేందర్, కేస సందీప్, రామన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

