
రామన్నపేట ఆగస్ట్ 29( నమస్తే న్యూస్)
వ్యవహారిక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ అన్ని భాషల కన్నా తెలుగు ఎంతో మధురమైనదని, చాలామంది భాషావేత్తలు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేశారని అటువంటి మాతృభాష పట్ల నిరాదరణ కలిగి ఉండకూడదని అన్నారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ గ్రాంథిక భాషలో రచనలు చేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి అర్థం కావని, కావున సామాన్య ప్రజలు మాట్లాడుకునే వ్యవహారిక భాషలోనే రచనలు చేయాలని వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నిర్వహించడమే కాకుండా తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడని అన్నారు. అంతేకాకుండా గ్రాంథిక భాషా వాదులపై ఒక పిడుగులాంటివాడని, భాష పట్ల ఆయనకున్న అంకితభావం చాలా గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఆర్.రత్న మంజుల, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్ ,తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
