రామన్నపేట ఆగస్ట్ 29( నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో సెప్టెంబర్ 8 ,9,10 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే ఏఐవైఎఫ్, రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సుద్దాల సాయికుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో యువత శాతం అధికంగా ఉన్నప్పటికీ వారికి నాణ్యమైన విద్య, శాశ్వత ఉపాధి, అందుబాటు వైద్యం, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. జిల్లాలోని పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన వార్షిక క్యాలెండర్, పెండింగ్ నియామకాల పూర్తి, జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రైవేట్, కాంట్రాక్ట్, గిగ్ రంగాల్లో పనిచేస్తున్న యువతకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని కోరారు.యువత, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారం, ఫీజుల సమస్యలు, పరీక్షల నిర్వహణలో జాప్యం, పేపర్ లీకులు, నిరుద్యోగ పోటీ పరీక్షల కోసం ఖరీదైన కోచింగ్‌పై ఆధారపడాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ముగించాలని ఆయన అన్నారు. ప్రతి జిల్లాలో ఉచిత పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, విద్యార్థి హాస్టళ్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులను బలోపేతం చేయాలని అన్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు కళ్లెం స్వామి, కార్యదర్శి రచ్చ దయాకర్, ముగ్గు మచ్చగిరి, ముగ్గు ప్రవీణ్, రచ్చ రాజేష్, ఊట్కూరి శ్రీను, ఉట్కూరు కృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.

