8రిపోర్టర్: పిల్లల, మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి – రేవంత్ సర్కార్‌పై BJP నేతల ఆగ్రహం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో ఈరోజు BJP పార్టీ జిల్లా అధ్యక్షులు బై రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది,రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పిలుపు మేరకు ఫీజు బకాయిల చెల్లింపుపై నిర్వహిస్తున్న ఉద్యమంలో నిరాహార దీక్షలో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం, బీజేపీ మండల నాయిని శ్రీనివాస్ , మండల జనరల్ సెక్రటరీ ఊకే రామూర్తి పాల్గొన్నారు.మండల అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను పేరుకుపోయేలా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఎందుకు ఆటలాడుతోంది?”రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నాడు.మండల జనరల్ సెక్రటరీ ఊకే రామూర్తి మాట్లాడుతూ.
రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పేద విద్యార్థి ఉన్నత విద్య చదవాలంటే ప్రభుత్వం అండగా నిలవాలి తప్ప, బకాయిల పేరుతో వారి చదువులకు అడ్డంకులు సృష్టించకూడదని అన్నారు. కళాశాలలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థుల చదువులు, పరీక్షలు, సర్టిఫికెట్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, మాటలు కాదు.. చేతల్లో చూపించాలని డిమాండ్ చేశాడు.విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే BJP చూస్తూ ఊరుకోదు!”ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే BJP ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.విద్యార్థుల హక్కుల కోసం BJP పోరాటం కొనసాగుతుంది.ఫీజు బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం ఆగదు అన్నారు, ఈ కార్యక్రమంలో BJP మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

