డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 27 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంకురాం తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు భూక్యా అమ్రు కుమారుడు డాక్టర్ మధు,డాక్టర్ శ్రావణిల వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డీఎస్ రెడ్యా నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా శంకర్,కోట కరుణాకర్ ,అజ్మీరారెడ్డి, ఉపేందర్, లచ్చు,తేజా, లాలు, వెంకన్న, హరినాథం, శంకర్, శ్రీనివాస్, శ్రీను, హనుమంతు, వెంకన్న డీలర్, బిచ్యా, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.


