మరిపెడ,ఆగస్టు 27 (నమస్తే న్యూస్):మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 7 వార్డులకు సంబంధించిన ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలం రవీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రవింధర్ రెడ్డి మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ,కొత్త ఓటర్ల నమోదు,తప్పుల సవరణ అంశాలపై బీఎల్ఓలతో ఆయన వివరంగా చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనదేనని,సవరణలు చేయవలసినవి ఉంటే ప్రత్యక్షంగా అభ్యర్థిని కలిసి వివరణ తీసుకోవాలి చెప్పారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు,వార్డు కౌన్సిలర్లు రాము,భాస్కర్,వార్డు అధ్యక్షులు బోడ రమేష్,బోడ రవి,శ్రీను,దల్ సింగ్,దశ్రు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


