నాటిన మొక్కలను సంరక్షించుకోవలసిన భాధ్యత తీసుకోవాలి.
నేతావత్-పర్కజాల్ తండా సర్పంచ్ భానోత్ కొండయ్య.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 27(నమస్తే న్యూస్):
మరిపెడ మండలంలోని నేతావత్-పర్కజాల్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గురువారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భానోత్ కొండయ్య మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..మొక్కలు నాటడమే కాదు,నాటిన మొక్కను బాధ్యతగా సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కలను పెంచాలని సూచించారు.ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కృష్ణ,అంగన్వాడీ టీచర్,బీఎల్వో భానోత్ కవిత,సీఏ భానుమూర్తి లాల్,వార్డు సభ్యురాలు,ఆశా వర్కర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై గ్రామ సభ..ఓటరు జాబితా సవరణకు ఏకగ్రీవ ఆమోదంమరిపెడ మండలంలోని నేతావత్-పర్కజాల్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గురువారం గ్రామ సభ నిర్వహించారు.ఈ గ్రామ సభకు సర్పంచ్ భానోత్ కొండయ్య అధ్యక్షత వహించగా,గ్రామస్తులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఓటరు జాబితాలో పేర్ల సవరణలు,మార్పులు,చేర్పులపై చర్చించారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సర్పంచ్ తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు…


