మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాష్పంగు వెంకటేశ్వర్లు.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 27(నమస్తే న్యూస్).
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం,మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో కొలువుదీరిన బంగారు మైసమ్మ తల్లికి కూరగాయల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాష్పంగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..మరిపెడ కూరగాయల మార్కెట్ లో కొలువుదీరిన బంగారు మైసమ్మ తల్లికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నామని తెలిపారు.బంగారు మైసమ్మ తల్లిని కోరుకుంటే కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అన్నారు.బంగారు మైసమ్మ తల్లి దీవెనలతో మార్కెట్ యూనియన్ సభ్యులందరూ సుఖసంతోషాలతో,అష్టైశ్వర్యాలతో,ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు పత్రుమియా,యూనియన్ సభ్యులు మలికాంబ,పద్మ,రాజు,లచ్చమ్మ,నాయుడు తదితరులు పాల్గొన్నారు.

