వ్యవసాయకార్మికసంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జల్లెల్ల పెంటయ్య
రామన్నపేట ఆగస్ట్ 27(నమస్తే న్యూస్)
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వ్యవసాయ కూలీలు సామాన్య ప్రజలపై భారంగా మారిందని వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు జల్లెల పెంటయ్య ఆందోళన వ్యక్తం చేశారు, చక్కెర ధరలు సగటు 65 పైగా వంట నూనె, పప్పులు, బియ్యం, పిండి, చక్కెర, కూరగాయలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాల స్థితిగతులు పూర్తిగా దెబ్బతింటోందని అన్నారు,ప్రజలపై భారాన్ని మోపే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వ నిల్వలను ఉపయోగించాలని, మార్కెట్లో కృత్రిమ కొరతను అరికట్టాలని, పేదలకు సబ్సిడీతో నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు,
అలాగే వంటగ్యాస్ ధరలను అందుబాటులోకి తీసుకురావాలని, పెట్రోల్ ,డీజిల్ ధరల భారాన్ని తగ్గించాలని,సరసమైన ధరలకు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని పెరిగిన ధరలు వెంటనే ఉపసవారించుకోవాలని లేని పక్షంలో వ్యవసాయ కూలీలను ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన కొనసాగిస్తామని అన్నారు,ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు, కార్యదర్శులు కందులహనుమంతు,మేడి,ముకుంద అవనగంటి నగేష్,ఉండ్రాతి నరసింహ,నాగటి లక్ష్మణ్. శానకొండ వెంకటేశ్వర్లు,ఎడ్ల ధనమ్మ,పిట్టల పద్మ,చెన్ని స్వామి,అనంతరం సుభాష్ సెంటర్లో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నరసింహచారి,గొర నాగిటి ఉపేందర్, తాళ్ల పెళ్లి జితేందర్, జోగుల శ్రీనివాస్, కొమ్ము నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.

