l
ఎర్రగడ్డలో మొక్కల నాటిన మంత్రి పొంగులేటి
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 27 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నూతన ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో విద్యా వసతులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం. గోపాలపురం గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న నూతన ప్రాథమిక పాఠశాల భవనం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణంలో విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తాం అని తెలిపారు.విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహశీల్దార్ విల్సన్, ఎంఈఓ నుకారపు బాబు కాంప్లెక్స్ హెచ్ఎం విజయ కుమారి పాఠశాల హెచ్ఎం ఇందిరా ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్లమల్ల కీర్తి నీరణ్ కుమార్, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ కోక్కిరేణి సర్పంచ్ కర్నాటి రాజేంద్రప్రసాద్ మాజీ సర్పంచ్ గడ్డి కొప్పుల రాజు బోడ మంగీలాల్ మాజీ జడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నల్లమల్ల ప్రతాప్ జడల నగేష్ గౌడ్ రేపాకుల శివలింగం దుబాకుల పిచ్చయ్య గద్దల సుధాకర్ గద్దల నరసింహారావు బానోత్ సిమ్లా నాయక్ భానోత్ అనిల్ నల్లబెల్లి లింగన్న ఉన్నం రామయ్య ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


