తిమ్మక్కపేటలో 10 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, ఆగస్టు 27: (నమస్తే న్యూస్)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తిమ్మక్కపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ శాఖ కార్యదర్శి పత్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాస్‌లైన్ ప్రజాపంథా, టీఆర్ఎస్కు చెందిన 10 కుటుంబాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సబ్సిడీపై గ్యాస్, సన్న బియ్యం, సన్న వడ్లకు రూ.500 బోనస్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అలాగే గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు, పాఠశాల భవనాల నిర్మాణంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్, తిమ్మక్కపేట గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, ముక్కపాటి నాగేశ్వరావు, ఆశీర్వాదం, దుబ్బాకుల పిచ్చయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

