కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్ పిలుపు
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 26 (నమస్తే న్యూస్ )
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు తిరుమలాయపాలెం మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని గోపాలపురం గ్రామంలో ఉదయం 9:30 గంటలకు నూతనంగా నిర్మించ తలపెట్టినపాఠశాల భవననికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ సందర్భంగా పాస్టర్ రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తిరుమలాయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల అశోక్ పిలుపునిచ్చారు.
ప్రజలకు అవసరమైన విద్యా వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాల భవనాల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ ఐక్యతను చాటాలని కొప్పుల అశోక్ కోరారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఐక్యంగా ముందుకు సాగుదాం” అని కొప్పుల అశోక్ పిలుపునిచ్చారు.

