రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 26 (నమస్తే న్యూస్)
బందారపు సైదులు కోరుకున్న సమ సమాజం కోసం, ఆయన ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉద్యమించాలని పార్టీ జిల్లా కార్యదర్శి ఉన్న నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.తిరుమలాయపాలెం మండలం లోని మేడిపల్లి గ్రామంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సైదులు సంస్మరణ సభ పార్టీ మండల నాయకులు షేక్ పత్తే అహ్మద్ అధ్యక్షతన జరిగింది. ఈ సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రసంగిస్తూ సైదులు తన పుట్టిన దగ్గరనుంచి చనిపోయేంతవరకు ఎత్తిన ఎర్రజెండా దించకుండా ఎర్రజెండా బాటలో పయనించాడని ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలందరూ కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్నతనం నుంచి కార్మిక సంఘం ఎస్ఎఫ్ఐ డివైఎంఐ సంఘంలో పనిచేస్తూ పార్టీ విస్తరణ కోసం కృషిచేసిందని ఆయన కొనియాడారు. నేటి రాజకీయాల్లో త్వరగా మార్పులు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా యువత కమ్యూనిస్టు రాజకీయాల వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. జన్ జి ఉద్యమాలు పెరిగి యువత మార్పులు కోరుకుంటున్నారని ఇది కమ్యూనిస్టులు మంచి పరిణామం అని ఆయన అన్నారు.
అనంతరం సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎర్ర శ్రీనివాసరావు,మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు షేక్ బసీరుద్దీన్,మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అంగిరేకుల నరసయ్య, తుళ్లూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పద్మనాభుల సుధాకర్ రావు బింగి రమేష్ కొత్తపల్లి వెంకన్న మాచర్ల రాజశేఖర్ దాసరి మహేందర్ ఎర్ర పాపిరెడ్డి చిట్టెపరెడ్డి వెంకటరెడ్డి మర్ల సత్తిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నందిగామ పుల్లారెడ్డి ఫోటో ఉపేందర్ రెడ్డి రావుల విజయపాల్ రెడ్డి తంగెళ్ల రమేష్ పోలిపొంగు ముత్తయ్య రావుల కృష్ణారెడ్డి బోర ఉపేందర్ రెడ్డి వీరారెడ్డి తిరుమల దిండు మంగపతి సునీల్ నవీన్ దొందేటి నిర్మల్ రావు లింగస్వామి చే రెడ్డి నరేష్ రెడ్డి చే రెడ్డి నరేష్ రెడ్డి రావు వెంకట్రామిరెడ్డి వెంకన్న నగేష్, శాఖ కార్యదర్శి మాచర్ల రాజశేఖర్ బంధుమిత్రులు పాల్గొన్నారు.

