డోర్నకల్ ఆగష్టు 26 (నమస్తే న్యూస్ )మానవ సేవే మాధవ సేవగా భావించిన మహనీయురాలు మదర్ తెరిసా జయంతి వేడుకలు డోర్నకల్ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీ వారి ఆధ్వర్యంలో బుధువారం ఘనంగా నిర్వహించారు. పేదలు, అనాథలు, నిరాశ్రయులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచి, తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేసిన మదర్ తెరిసా సేవలను మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి హరినాథ్ బాబు కొనియాడారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని నిరుపేదలు, ఆపన్నులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.మానవత్వం, సేవాభావం, ప్రేమ, కరుణతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదలకు సహాయం అందించారు. మదర్ తెరిసా చూపిన సేవా మార్గం నేటి తరానికి ఆదర్శమని, ఆమె ఆశయాలను కొనసాగించడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎస్ ఐ ఝాన్సీ, మదర్ తెరిసా ఫౌండేషన్ సభ్యులు మొత్తయ్య , వైస్ చైర్ పర్సన్ మాధ లావణ్య శ్రీనివాస్ , పట్టణ అధ్యక్షుడు సుమేర్ జైన్,మాజీ చైర్మన్ వీరన్న,కౌన్సిలర్లు ఎల్లవుల సువర్ణ హరికృష్ణ ,గారే రమేష్, హేమలత, రాము,బి ఆర్ వీరస్వామి, సుశీల్ కుమార్, ప్రవీన్ ,వేణు, మాతంగి అనిల్, దాసరి నాని, అశ్వక్ తదితరులు ఉన్నారు.

