పట్టించుకోని సంబందిత అధికారులు.
మరిపెడ,ఆగస్టు 26 (నమస్తే న్యూస్).మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన కూడలిలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి మంచినీరు వృథాగా రోడ్డుపైకి వస్తుంది.పట్టణంలోని రోడ్లు & భవనాల శాఖ(R&B) అతిథి గృహం ఎదుట,సనా చికెన్ సెంటర్ ముందు ఈ పైపు లీకేజీ ఏర్పడింది. గత కొద్ది రోజులుగా పైపు పగిలి వేల లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు వృథాగా రోడ్లపై ప్రవహిస్తూ మురికి కాలువలో కలుస్తోంది.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తుంటే,అధికారుల పర్యవేక్షణ లోపం,నిర్లక్ష్యం కారణంగా ఇలా నీరు వృథా అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే,ఇలా రోడ్లపై నీరు వృథాగా పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పగిలిన పైప్ లైన్ ను వెంటనే మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని మున్సిపల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు.


