మరిపెడ,ఆగస్టు 26(నమస్తే న్యూస్):మరిపెడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 13 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మరిపెడ సీడీపీఓ ఎం.ఎల్లమ్మ తెలిపారు.*ఖాళీల వివరాలు:*మరిపెడ మండలంలో 8 పోస్టులు:1) మంచ తండా (ST).2) చాప్లా తండా (ST).3) బాల్నిధర్మారం-2 (SC).4) మాన్సింగ్ తండా (ST).5) పీర్యా తండా (ST).6) గాలివారి గూడెం (BC-A).7) సీతారాంపురం-3, 4వ వార్డు (OC).8) జమ్ముల తండా (ST).దంతాలపల్లి మండలంలో 2 పోస్టులు:1) బొడ్లాడ-1 (OC).2) బొడ్లాడ-2 (SC)నరసింహులపేట మండలంలో 3 పోస్టులు:1) బిల్యా తండా (ST).2) పాండ్యా తండా (ST).3) మూడవత్ తండా (ST)…దరఖాస్తులను ఆగస్టు 25వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు *wdcw.telangana.gov.in* వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేసుకోవాలని తెలిపారు.అర్హతలు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.వయోపరిమితి:01-07-2026 నాటికి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 9 నుండి 15వ తేదీ వరకు కార్యాలయ పని వేళల్లో మరిపెడ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అటెస్టెడ్ జిరాక్స్ కాపీలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలన్నారు. హాజరు కాని పక్షంలో వారి దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని కోరారు.

