మహబూబాబాద్, ఆగస్టు 26 (నమస్తే న్యూస్):
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా యువజన అధ్యక్షుడిగా కారింగుల సాగర్ గౌడ్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు చేతుల మీదుగా సాగర్ గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా సాగర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గౌడ యువజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.జిల్లాలో గౌడ యువత కోసం హాస్టల్ నిర్మాణానికి కృషి చేయడంతో పాటు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. గౌడ యువత సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేలా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.తనకు జిల్లా యువజన అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపక అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్ గౌడ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోల్కాపురి శ్రీకాంత్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గండి వీరేందర్ గౌడ్లకు సాగర్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘ నాయకులు జెర్రీ పోతుల వెంకన్న గౌడ్, గండి శారద గౌడ్, బోలగాని నవీన్ గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

i
