రామన్నపేట, ఆగస్ట్ 25(నమస్తే న్యూస్)
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో భాగంగా రామన్నపేట సర్కిల్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏ.రామాచారి ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక సీఐ యం. రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించగ రామన్నపేట సర్కిల్ పరిధిలోని ఐదు మండలాల కానిస్టేబుల్స్ ఎన్నికల్లో పోటీల్లో నిలిచిన ఐదుగురు సభ్యులలో రామచారిని అత్యధిక ఓట్లు వేసి ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన రామాచారినీ పోలీస్ సిబ్బంది మిత్రులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ కానిస్టేబుళ్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.

