రామన్నపేట, ఆగస్టు 25 (నమస్తే న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం అందించిన ఉచిత నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి సురేష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి, విద్యాభివృద్ధితో పాటు కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడంతో పాటు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని సూచించారు.విద్యార్థులు సిగరెట్, గంజాయి, మద్యం తదితర చెడు అలవాట్లకు దూరంగా ఉండి.. చదువుపై దృష్టి సారించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జగదీష్, లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు ప్రసన్నదేవి, పున్నారావు, మాల వెంకటరెడ్డి, ముందడి వెంకటరెడ్డి, కిరణ్, నిర్మల, కవిత, నరసింహారావు, రాజేశ్వరి, అశోక్ కుమార్, శ్రీకాంత్, నగేష్, అశోక్ రెడ్డి, ఉపేందర్ రావు, కరుణ, ఉమారాణి, పరశురాం, శ్రావణ్ కుమార్, నాగమణి, నాన్ టీచింగ్ సిబ్బంది పుష్పలత, నరసయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

