సోలిపురం గ్రామపంచాయతీ లో ఘనంగా వన మహోత్సవం
సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 25 (నమస్తే న్యూస్ )
మానవాళి మనుగడకు మొక్కలు జీవనాధారం అని ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి పర్యావరణ సంరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని గ్రామ సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్ పేర్కొన్నారు మంగళవారం తిరుమలాయపాలెం మండలం లోని సోలిపురం గ్రామపంచాయతీ సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందని గ్రామ సర్పంచ్ నునవత్ సమ్మక్క అశోక్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నునావత్ సమ్మక్క. అశోక్ , ఉపసర్పచ్ బానోత్. జ్యోతి. పీకల పంచాయతీ కార్యదర్శి,వెంకట్రావు గ్రామ ప్రజాప్రతినిధులు ఫీల్డ్ అసిస్టెంట్ పంది అంజయ్య, వార్డ్ నెంబర్స్ గ్రామ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

