రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ కమల రూప్ సింగ్
తిరుమలాయపాలెం, ఆగస్టు 25 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని పడమటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కమల రూప్సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోత్ కమల రూప్సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీకి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందని తెలిపారు. రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరింత సౌకర్యవంతంగా రేషన్ అందుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోత్ కమల రూప్ సింగ్ ఉప సర్పంచ్ నునావత్ తిరుపతి పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి సంధ్యారాణి జిపిఓ కోటయ్య వార్డు సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

