రామన్నపేట ఆగస్ట్ 25( నమస్తే న్యూస్)

యాదాద్రి-భువనగిరి జిల్లా, రామన్నపేట జి ఆర్ ఎం, ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ, గత పదేళ్లుగా అర్హులకు రేషన్ కార్డులు మంజూరు కాలేదన్నారు, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు, రామన్నపేట పట్టణంలో అర్హులకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, తహసిల్దార్ లాల్ బహుదూర్, ఎంపీడీవో రాములు, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్, కోమ్మాయిగూడెం సర్పంచ్, మల్లారెడ్డి, రామన్నపేట ఉప సర్పంచ్, మోటే రమేష్, మాజీ ఎంపీటీసీ రేహాన్, జెల్లా వెంకటేశం , కేస కిరణ్, ప్రజాప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


