అధిష్టానం ఆదేశాలతోనే మండల,మున్సిపల్ కమిటీలు.
ఓట్ల పరిరక్షణకు ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలి.
ప్రభుత్వ విప్ జాటోతు రామచంద్రు నాయక్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 25(నమస్తే న్యూస్).
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ పిలుపునిచ్చారు.మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్ లో మండల అధ్యక్షుడు గుగులోతు రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రత్యేక అవగాహన సదస్సుకు ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ అవేజ్ ఖాన్ తో కలిసి హాజరయ్యారు.అంతకు ముందు వన మహోత్సవంలో భాగంగా ఎల్లంపేట గ్రామంలో,మరిపెడ మున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు బానోతు రాములాల్ తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించాలని,ఒక్క అర్హుడి ఓటు కూడా మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మండల,మున్సిపల్ కమిటీలు అధిష్టానం తీసుకునే నిర్ణయం మేరకే నియమితులవుతాయని స్పష్టం చేశారు.పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో, అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని,మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర వాతావరణం అందించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్,వైస్ చైర్మన్ పెద్దబోయిన ఐలమల్లు,మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్,కౌన్సిలర్లు,సర్పంచులు,6 మండలాల అధ్యక్షులు,డోర్నకల్ మున్సిపల్ నాయకులు,కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

