మహబూబాబాద్ ఆగస్టు 25 ( నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో వర్షాలు పడాలని 21 రోజులుగా హనుమాన్ భజన నిర్వహించి చివరి రోజుగా ఆంజనేయస్వామి ఆలయంలో పులికాపు కార్యక్రమం నిర్వహించారు. పూర్వకాలం నాటి ఆచారం ప్రకారం ప్రదర్శనగా కంబాలపల్లి చెరువు వద్దకు చేరుకుని.., చెరువు వద్ద గల వరదపాశం బండమీద ప్రత్యేకంగా తయారు చేసిన వరదపాశం ప్రసాదాన్ని పోసారు. అనంతరం వర్షాలు కురిపించి మా..కరువు తీర్చాలంటూ వరుణదేవున్ని వేడుకుని.., బండపై పోసిన ప్రసాదాన్ని మొకాలపై కూర్చుని నాలుకతో నాకుతూ ఆరగించారు. ఇలా చేయడం వలన ప్రజల బాధలు వరుణదేవునికి తెలుస్తాయని.., కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడనే విశ్వాసంతో ఈ..కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలిపారు. ప్రస్తుతం ఎలినోనా ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురియకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ప్రకృతిదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ..కార్యక్రమంలో కంబాలపల్లి సత్యనారాయణ, తుప్పతూరి మల్లయ్య, కళ్లెం జనార్ధన్, పిట్టల వెంకన్న, పోరెడ్డి ఇంద్రారెడ్డి, సామ బిక్షం, సత్యనారాయణ రెడ్డి, కొత్త రమణారెడ్డి, కామటం వీరన్న తదితరులు పాల్గొన్నారు.

