ప్రారంభించిన ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. జాటోత్ రామచంద్రు నాయక్
డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 25 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్కినేపెల్లి వెంకటసాయి శ్రీ దుర్గా డిజిటల్ హబ్‌ను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ సోమవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి డిజిటల్ హబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రజలకు ఆన్లైన్ సేవలు మరింత అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. యువకుడైన అక్కినేపెల్లి వెంకటసాయి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ, మరిపెడ పట్టణ ప్రజలకు వివిధ ఆన్లైన్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.శ్రీ దుర్గా డిజిటల్ హబ్ ద్వారా ప్రజలకు అవసరమైన వివిధ ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్ హావెజ్, జిల్లా నాయకుడు ఒంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్‌రెడ్డి, వైస్ చైర్పర్సన్ కాలం సునీత రవీందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుగులోత్ రవినాయక్, టౌన్ అధ్యక్షుడు రాంలాల్ నాయక్, కాంగ్రెస్ నాయకులు గందసిరి అంబరీష్, అఫ్జల్, శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌నాయక్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి హాజరైన అతిథులకు అక్కినేపెల్లి వెంకటసాయి కృతజ్ఞతలు తెలిపారు. మరిపెడ పట్టణ ప్రజలు తమ నూతన సంస్థను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.


