వై ఆర్ జి కేర్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవిపై అవగాహన ర్యాలీ
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం,ఆగస్ట్ 25 (నమస్తే న్యూస్)
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం లో బీరోలు గ్రామంలోని వై ఆర్ జి కేర్ సంస్థ ఆధ్వర్యంలో పై హెచ్ఐవిఅవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది వై ఆర్ జి కేర్ సంస్థ సూపర్వైజర్ కర్లకుంట నరేష్ మాట్లాడుతూ హెచ్ఐవి ,సుఖ వ్యాధులు, టిబి వ్యాధులు వంటి వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది .18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారైనా హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలని చెప్పడం జరిగింది హెచ్ఐవి అంటువ్యాధి కాదని చెప్పడం జరిగింది హెచ్ఐవి సోకిన వారి పట్ల వివక్షత భావం లేకుండా చూడాలని వారిని కూడా గౌరవించాలని చెప్పడం జరిగింది ఏఆర్టి మందులు మరియు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం సమక్షేమ పథకాలు అనగా ఆసరా పెన్షన్ వంటి వాటి గురించి చెప్పటం జరిగింది. గ్రామ సర్పంచ్ దేవభిక్షం మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ రక్త పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పడం జరిగింది ప్రధానోపాధ్యాయులు వీర స్వామి మరియు ఎంపీహెచ్ఏ ఎం పద్మ మాట్లాడుతూ హెచ్ఐవి నివారణలో అందరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని విద్యార్థులు గ్రామ ప్రజలందరూ అవగాహన పెంచుకోవాలని జాగ్రత్త పాటించాలని చెప్పడం జరిగింది కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మౌనిక, గ్రామ దీపిక మాధురి, ఏ ఎన్ ఎం, ఉపాధ్యాయులు అన్వర్ పాషా, వెంకటేశ్వర్లు వై. ఆర్ జి కేర్ సంస్థ లింక్ వర్కర్ ఉషారాణి, ఆశా వర్కర్స్ ఊర్మిళ సరిత రేణుక మరియు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు

