మహబూబాబాద్, ఆగస్టు 25 (నమస్తే న్యూస్): వానాకాలం–2026 పంట సర్వేలో భాగంగా డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) ప్రక్రియను రెవెన్యూ గ్రామాల్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వాలంటీర్ను ఎంపిక చేశారు. రైతులు తాము సాగు చేసిన పంట, విస్తీర్ణం తదితర వివరాలను సంబంధిత వాలంటీర్ ద్వారా డిజిటల్ క్రాప్ సర్వేలో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.డీసీఎస్లో నమోదైన పంటల వివరాల ఆధారంగానే పంటల కొనుగోళ్ల ప్రక్రియను అనుసంధానం చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు తమ పంట వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు.ఈ క్రమంలో బొడ్లాడ గ్రామంలో మంగళవారం పంట సర్వే ప్రక్రియను ప్రారంభించారు. మండల వ్యవసాయ అధికారి పి.వాహిని, వ్యవసాయ విస్తరణ అధికారి హర్షవర్ధన్, పంట సర్వే వాలంటీర్, రైతులు పాల్గొని పంటల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు.రైతులు తమ పంటల వివరాలు, సాగు విస్తీర్ణాన్ని వాలంటీర్కు అందించి డీసీఎస్లో నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

