అలాగే నియోజకవర్గ బూత్ ప్రతినిధుల శిక్షణా శిబిరం.
ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే రామచంద్రు నాయక్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 25(నమస్తే న్యూస్).
డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రెండవ దశ ప్రక్రియపై నియోజకవర్గ స్థాయి శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని భార్గవ్ పంక్షన్ హాలులో మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శిక్షణా కార్యక్రమంలో ఓటర్ల జాబితా సవరణ రెండవ దశ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఓటర్ల అనుసంధానం, అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తులపై బూత్ స్థాయి ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయకర్త ఎం.డి.అవేజ్ పాల్గొని బూత్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.ఈ ముఖ్యమైన శిక్షణా కార్యక్రమానికి డోర్నకల్ నియోజకవర్గంలోని బూత్ ప్రతినిధులు, సర్పంచులు, వార్డు సభ్యులు, పురపాలక అధ్యక్షులు,పారిషద్ సభ్యులు,ముఖ్య కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు…

