రామన్నపేట ఆగస్టు 24 ( నమస్తే న్యూస్)
పాత్రికేయ రంగానికి సీనియర్ జర్నలిస్టు ఎండి ఇబ్రహీం మృతి తీరనిలోటు అని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. సోమవారం రామన్నపేట పాత్రికేయ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇబ్రహీం సంతాప సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు పాత్రికేయ రంగంలో 50 సంవత్సరాలు పైగా ఒకే పత్రికలో పనిచేసిన గొప్ప వ్యక్తి ఎండి ఇబ్రహీం అని కొనియాడారు. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందర్నీ కలుపుగోలుగా కలుపుకొని అందరి మన్ననలు పొందిన వ్యక్తి ఇబ్రహీం ఒక్కరేనని అన్నారు. 2018 నుండి తనకు ఎంతో సానిహిత్యం గా ఉంటూ ఎప్పటికప్పుడు తనతో మాట్లాడుతూ పలు సమస్యలపై చర్చించేవారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. పాత్రికేయ రంగంలో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తు పాత్రికేయ రంగంలో నిబద్ధత కలిగిన వ్యక్తి ఇబ్రహీం ఒక్కరేనని కొనియాడారు. ఆయన మృతి ప్రతి ఒక్కరికి తీరనిలోటని ఎల్లవేళలా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పున్న జగన్మోహన్,సిరిగి రెడ్డి మల్లారెడ్డి, ఎండి జమీరుద్దీన్, గంగుల వెంకట రాజారెడ్డి, పూస బాలకిషన్, పోచబోయిన మల్లేశం, ఉట్కూరి నరసింహ, బొడ్డుపల్లి వెంకటేశం, వనం చంద్ర శేఖర్, మీర్జా ఫజల్ బేగ్, గోదాసు పృథ్వీరాజ్, ఎండి రెహాన్, ఎండి అక్రమ్, మిర్యాల మల్లేశం, సాల్వేర్ అశోక్, కందుల హనుమంతు, మండల పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.


