మేస్త్రిగా సముద్రాల వెంకన్న.. సెకండ్ మేస్త్రిగా ఘనపురపు ముత్తయ్య
మహబూబాబాద్,ఆగస్టు24 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ పురపాలక సంఘం సమీకృత కూరగాయల సీహెచ్వీ వెజిటేబుల్ మార్కెట్లో నూతన హమాలీ సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీఐటీయూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరికుంట్ల నాగన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.నూతన కార్యవర్గంలో మేస్త్రిగా సముద్రాల వెంకన్న, సెకండ్ మేస్త్రిగా ఘనపురపు ముత్తయ్య, కోశాధికారిగా బండపల్లి జీవన్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా అట్టికా అశోక్, గునిగంటి నవీన్, ఆకుల సతీష్ ఎంపికయ్యారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు హమాలీలు, కార్మికులు అభినందనలు తెలిపారు. హమాలీల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

