తనకు రావాల్సిన రూ.20 లక్షలు చెల్లించాలి: సలవాది పాండు
డోర్నకల్/మరిపెడ, ఆగస్టు 22 (నమస్తే న్యూస్): తనపై తప్పుడు ప్రచారం చేయడం, లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని బాబోజీగూడెం గ్రామానికి చెందిన సలవాది పాండు కోరారు. తనకు రావాల్సిన కష్టార్జితాన్ని అడిగినందుకే కొందరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని సాయి అక్షిత గ్రీన్ సిటీ వెంచర్లో గంట శ్రీను, విజయ్ టీంలో ఏజెంట్గా సుమారు ఐదేళ్లపాటు పనిచేశానని పాండు తెలిపారు. ఈ వ్యాపారంలో తనకు రావాల్సిన సుమారు రూ.20 లక్షలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.తనకు రావాల్సిన డబ్బులను అడిగినందుకు బెదిరింపులకు గురిచేస్తున్నారని, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాండు పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదించిన డబ్బును అడిగినందుకే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని పాండు కోరారు. ఇలాంటి ప్రచారం కొనసాగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనకు రావాల్సిన డబ్బులను చెల్లించి న్యాయం చేయాలని కోరారు.

