రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 22 (నమస్తే న్యూస్ )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తిరుమలాయపాలెం మండల పరిధిలోని సోలిపురం గ్రామంలో నిర్వహించారు.గ్రామ సర్పంచ్ నునవత్ సమ్మక్క అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు 415 నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నునవత్ సమ్మక్క అశోక్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందేలా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టడం పట్ల గ్రామ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే సోలిపురం గ్రామానికి స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేసి, ప్రజలకు అందేలా కృషి చేసిన పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ నునవత్ సమ్మక్క అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నునావత్ సమ్మక్క అశోక్ జిపిఓ సుగుణ పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు మల్సూర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

