రిపోర్టర్: దామల్ల భాస్కర్ |సెంటర్:తిరుమలాయపాలెం
తిరుమలాయపాలెం ,ఆగస్టు 23 (నమస్తే న్యూస్ ) ఆహార భద్రత స్మార్ట్ కార్డులపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ప్రచురించాలని భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఆహార భద్రత కోసం ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం ద్వారా 2019 నుండి 2031 వరకు ఉచితంగా 5 కేజీలు ఇస్తున్నారు ఇంకా ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు . సొమ్ము కేంద్రానికి ఫోటోలు మివా 1 కేజీ బియ్యం ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టడం సరికాదని తెలంగాణ రాష్ట్రం లో 13 సంవత్సరాల తర్వాత ఇచ్చిన రేషన్ కార్డులను సక్రమంగా ఇవ్వకుండా అనేక అక్రమాలకు పాల్పడి అధికార పార్టీ చెప్పిన వాళ్ళకి ఇచ్చి నిజమైన అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇంకా ఇవ్వలేదుఅని కేంద్రం నుంచి బియ్యం పంపిణీ జరుగుతుంటే కొత్త రేషన్ కార్డులపై వాళ్ల ఫోటోలు పెట్టుకోవడం డిజిటల్ రేషన్ కార్డుల పేరు మీద వాళ్ల అనుచరులకు రేషన్ కార్డు ప్రింటింగ్ కాంట్రాక్టు ఓపెన్ చెప్పి రాష్ట్ర ఖజానా నుండి వందల కోట్ల రూపాయలను దోచిపెట్టి ప్రజా సొమ్మును అక్రమంగా దోచిపెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ ఆరోపించారు ఆహార భద్రత స్మార్ట్ కార్డులపై నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

