ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి దిగ్బంధనం…స్తంభించిన రాకపోకలు
పాలేరు రిజర్వాయర్ నుంచి భక్త రామదాసు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం ఆగస్టు 23 (నమస్తే న్యూస్ )
సాగునీటి కోసం రైతులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పార్టీ తిరుమలాయపాలెం మండలంలో పోరుబాట పట్టింది. పాలేరు రిజర్వాయర్ నుంచి భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తిరుమలాయపాలెం మండలం లోని ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై బి ఆర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు.
మండలం లో ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సి రావడంతో ప్రతి ఏటా రైతులు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెట్టుబడులు పెరుగుతున్నా నీటి వసతి లేకపోవడంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భాషాబోయిన వీరన్న మాట్లాడుతూ.. తిరుమలాయపాలెం మండల రైతుల సాగునీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలేరు రిజర్వాయర్ గత ప్రభుత్వం తిరుమలాయపాలెం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా తిరుమలాయపాలెం మండలానికి సాగునీరు,తాగునీరు అందించేందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి మహ్మదాపురం వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలకి పైపులైన్ ద్వారా నిర్మాణం చేపట్టింది కానీ ఇప్పుడు వర్షాభావం పరిస్థితులు ఏర్పడడంతో కనీసం ఆరుతడి పంటలకు కూడా నీరు అందించే పరిస్థితి లేదని వ్యవసాయ అధికారులు ఇప్పటివరకు లిఫ్ట్ మోటార్లను ఆన్ చేయకపోవడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్లో ఎంతో కొంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ మండలంలోని రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందకపోవడం బాధాకరమన్నారు. భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తిరుమలాయపాలెం మండలానికి సాగునీరు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు పొలానికి నీరు చేరే వరకు మా పోరాటం ఆగదు. సాగునీరు రైతు హక్కు.. పాలేరు నీటితో తిరుమలాయపాలెం పంట పొలాలు పచ్చగా మారే వరకు ఉద్యమం కొనసాగిస్తాం” అని భాషాబోయిన వీరన్న పేర్కొన్నారు.
తిరుమలాయపాలెం మండల రైతుల సాగునీటి సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, పాలేరు రిజర్వాయర్–భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న , మండల నాయకులు బిల్లగిరి ధనుంజయ , రెడ్డి మల్ల నరేందర్ కొవ్వూరి సందీప్ రెడ్డి మాజీ సర్పంచ్ బోడ మంచా నాయక్ సర్పంచ్ లు ఆర్మీ రవి బోడ మంజు రవి మాజీ సర్పంచ్ ఆలస్యం నాగేశ్వరరావు వంచర్ల సత్యనారాయణ రెడ్డి తీగల మేఘనాధరావు మండల మైనార్టీ అధ్యక్షులు, గోల్ తండా ఉపసర్పంచ్ షేక్ చందు ,, మాజీ ఎంపీటీసీ ధరావత్ శంకర్ నాయక్ , బీరోలు వంచర్ల సత్యనారాయణ రెడ్డి భాష బోయిన తనై ప్రకాష్ కీసర సంకీర్తన రెడ్డి వశ పొంగు మల్లయ్య ఇస్లావత్ బావ్ సింగ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు


