రైతులకు సాగునీరు అందక ఆశలు అడియాసలేనా
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని సిపిఎం పాదయాత్ర
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల్ల పెంటయ్య
రామన్నపేట ఆగస్ట్ 23(నమస్తే న్యూస్)యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులైన ధర్మారెడ్డిపల్లి. పిలాయిపల్లి. కాలేశ్వరం బస్వాపురము. గంధమల్ల. శివన్న గూడెం. బునాదిగాని కాలువలు సంవత్సరాలు గడుస్తున్నా ఆరకొర నిధులు అత్తెసర పనులతో కాలయాపన చేస్తుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య అన్నారు.
అరకొర నిధులు అత్తెసరు పనులతో కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో సాగు, త్రాగునీటికి ఎంతో కీలకమైన బస్వాపూర్, గందమల్ల, చర్లగూడెం లాంటి బహుళార్ధక సాదక ప్రాజెక్టులు నిధుల కొరత వల్ల ఏండ్ల తరబడి పనులు పెండింగ్లో ఉంటున్నవని ఈ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేస్తే జిల్లా ప్రజల సాగు, త్రాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందని బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వలకు నిధులు విడుదలలో తీవ్ర జాప్యం వల్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయినవని, ఎంతో పురాతనమైన ఆసిఫ్ నహర్ కాల్వ, బృందావన్ కాల్వలను పునరుద్ధరించాలనే ప్రజల డిమాండ్ అతీగతిలేదని. శామీర్ పేట చెర్వును రిజర్వాయర్ చేస్తూ భువనగిరి జిల్లా ప్రాంతానికి నీరందిస్తామన్న ప్రతిపాదన నీరుగారిపోయిందనీ. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధిగా నిధులు విడుదల చేసి పనులు నిర్ణీత గడువులోపు పూర్తి అయ్యే చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. జిల్లా ప్రజలు ఎదుర్కొనే సాగు, త్రాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు ఆగస్టు 29,30,31 తేదీలలో పాదయాత్ర ద్వారా చలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈనెల 31న ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాకు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరుకావాల్సిందిగా కోరారు
రామన్నపేట మండల వ్యాప్తంగా వేలాది మంది సన్నా చిన్నకారు మధ్యతరగతి రైతాంగం వ్యవసాయ ఆధారంగా కుటుంబాలు గడుపుచున్నాయి. వెంటనే పెండింగ్ కాలువలకు బడ్జెట్ కేటాయించి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూపాదయాత్ర జయప్రదనికై నీర్నేముల, వెల్లంకి,సిరిపురం సర్నేనిగూడెం, కొమ్మాయిగూడెం, శోభనాద్రిపురం గ్రామాల్లో రైతులు ప్రజలతో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిన ఆనంద్,కూరెల్ల నరసింహ చారి వనం ఉపేందర్,నాగటి ఉపేందర్, నాగటి లక్ష్మణ్ ,గోగు లింగస్వామి, కర్రె సంతోష్,బర్ల బాబురావు, బండ జగన్మోహన్ రెడ్డి,గంగ దేవి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

